గ్లామ్‌షాట్‌: డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ బికినీ బ్యూటీ!

మరిన్ని వార్తలు

దిశ దిశలా గ్లామర్‌ హంగులు కుమ్మరించే అందం ముద్దుగుమ్మ దిశా పటానీ సొంతం. తెలుగులో డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్‌' చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్‌ రాలేదు. ఆ తర్వాత మరో ఛాన్స్‌ కూడా రాలేదు. కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దిశా పటానీ ఇప్పుడు తన అందచందాలతో బాలీవుడ్‌ని షేక్‌ చేసేస్తోంది. అందుకు కారణం ఆమె నటిస్తున్న 'మళంగ్‌' చిత్రం. లవ్‌లీ రొమాంటిక్‌ హీరోగా పేరు తెచ్చుకున్న ఆదిత్యరాయ్‌ కపూర్‌ ఈ సినిమాతో యాక్షన్‌ హీరో ఇమేజ్‌ కోసం ట్రై చేయగా, బాబుగారి యాక్షన్‌కి దిశా పాప గారి గ్లామర్‌ తోడై ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#HuiMalang out today @anilskapoor @adityaroykapur @khemster2 @mohitsuri

A post shared by disha patani (paatni) (@dishapatani) on

ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో దిశా హాట్‌ హాట్‌ గ్లామర్‌ మెయిన్‌ ఎట్రాక్షన్‌ కానుందట. ముఖ్యంగా హీరోతో దిశా అండర్‌ వాటర్‌ లిప్‌లాక్‌ సీన్‌ గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అలాంటి సీన్స్‌ చాలానే ఈ సినిమాలో హైలైట్‌ కానున్నాయట. ఇప్పటికే 'మళంగ్‌' టీజర్‌, ట్రైలర్‌, సాంగ్‌ ప్రోమోస్‌.. ఏది చూసినా దిశ స్కిన్‌ షో మతి పోగొట్టేస్తోంది. ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా నుండి రిలీజైన ఓ బికినీ పిక్‌ చూసి సోషల్‌ మీడియా జామ్‌ అయిపోతుందంటే అతిశయోక్తి కాదేమో. వైట్‌ అండ్‌ వైట్‌లో టూ పీస్‌ బికినీ ధరించి ఓ డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌ చూపిస్తూ నిలబడింది. పైన ఓ వైట్‌ జాకెట్‌ వేసింది. కానీ, కనిపించాల్సిన అందాలన్నీ పుష్కలంగా మురిపించేసరికి ఈ పిక్‌కి రావల్సిన దానికన్నా ఎక్కువ రెస్పాన్సే వచ్చేస్తోంది. లెట్‌ సీ దిస్‌ పిక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS