ఈ విజయ్‌తో మిస్‌ అయ్యింది ఆ విజయ్‌కి కనెక్ట్‌ అయ్యింది.!

మరిన్ని వార్తలు

‘హీరో’ సినిమా కోసం రౌడీతో జత కట్టాల్సిన ముద్దుగుమ్మ మాళవికా మోహనన్‌. అనుకోని కారణాలతో ఈ ప్రాజెక్ట్‌ అటకెక్కేయడంతో, ఈ భామ తొలి తెలుగు సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. అయినా సౌత్‌ సినిమాలపై ఆపేక్ష తీరని ఈ బ్యూటీ అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉంది. ఎట్టకేలకు తమిళంలో ఛాన్స్‌కొట్టేసింది. ఈ విజయ్‌తో తప్పితే ఏముంది.? అక్కడ విలక్షణ స్టార్‌ విజయ్‌ సేతుపతి సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుందట. ఇదిలా ఉంటే, తెలుగులోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ సెట్‌ అయ్యేలా ఉందని హింట్‌ ఇచ్చింది.

 

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఆ ప్రాజెక్ట్‌తో మాళవిక మోహనన్‌ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుందట. గ్లామర్‌లో ఎలాంటి మొహమాటాల్లేని ఈ బ్యూటీ సిట్యువేషన్‌ డిమాండ్‌ చేస్తే ఎంత ఎక్స్‌పోజింగ్‌ చేయడానికైనా సిద్ధమే అంటోంది. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిదొక్కుకోవాలటే కావల్సిన లక్షణాలివే.. అని ముందుగానే ఫిక్సయిపోయిందో ఏమో, ఎక్స్‌పోజింగ్‌కి సై అంటూ ముందే సంకేతాలిచ్చేసింది ముంబయ్‌ భామ మాళవికా మోహనన్‌. ఇక నటనకు భాషతో సంబంధం ఉండదని చెబుతున్న ఈ భామ గతంలో ఓ హిందీ చిత్రంలో నటించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS