మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బతుకే సో బెటర్’ చిత్రంలో నటిస్తున్నాడు. నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, తేజు తదుపరి చిత్రంపై ఓ న్యూస్ తాజాగా హల్చల్ చేస్తోంది. ‘సోలో లైఫే సో బెటర్’ తర్వాత తేజు ఓ పీరియాడికల్ చిత్రంలో నటించబోతున్నాడనేది ఆ న్యూస్ సారాంశం. శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటి బ్యాక్ డ్రాప్లో ఆ సినిమా రూపొందనుందట. వీరు పోట్ల ఈ సినిమాకి దర్శకుడు.. అని ప్రచారం జరుగుతోంది. అయితే, వీరు పోట్ల ప్రస్తుతం ఫామ్‌లో లేని దర్శకుడు. గతంలో ‘బిందాస్’, ‘రగడ’ వంటి చిత్రాలు తెరకెక్కించాడు.
కానీ, అవేమంత హిట్ సినిమాలు కావు. అయితే, తాజాగా వీరు ఓ స్టోరీ లైన్ చెప్పాడనీ, ఆ స్టోరీ లైన్ తేజుకి బాగా నచ్చేసిందనీ అదే తాజా ప్రాజెక్ట్ అనీ మాట్లాడుకుంటున్నారు. ఏమో, గుర్రం ఎగరా వచ్చు.. ‘చిత్రలహరి’ సినిమాతో వరుస ఫ్లాప్‌ల తర్వాత తేజు కెరీర్ ట్రాక్ ఎక్కేసింది. వరుస హిట్స్‌తో దూసుకెళుతున్నాడు. ఒకవేళ వీరు పోట్లతో సినిమా ఓకే అయితే, తేజు అదృష్టం ఆయనకీ పట్టి, ఓ సూపర్ డూపర్ హిట్ కొట్టేయొచ్చు. ఏం చెప్పగం.