ఈ హాట్‌ మేకోవరేంటి పాపా.!

By iQlikMovies - November 17, 2018 - 11:21 AM IST

మరిన్ని వార్తలు

'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో తెలుగు తెరపైకొచ్చింది మాళవిక నాయర్‌. క్యూట్‌ క్యూట్‌గా కన్పిస్తూనే, మంచి నటనా ప్రతిభతో ఆకట్టుకుందీ నేచురల్‌ బ్యూటీ. గొప్ప అందగత్తె కాకపోయినా, తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. అనూహ్యంగా హాటెస్ట్‌ మేకోవర్‌ని సంతరించుకుంది. తాజాగా 'ట్యాక్సీవాలా' ప్రమోషన్‌లో హాట్‌ లుక్‌తో దర్శనమిచ్చి, అందరి అటెన్షన్‌నీ తనవైపుకు తిప్పుకుంది. మాళవిక నాయర్‌తో పోల్చితే, ఇంకాస్త హాట్‌ లుక్‌తో హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ కన్పించినాగానీ.. టాలీవుడ్‌లో ఇప్పుడందరూ మాళవిక నాయర్‌ 'క్లీవేజ్‌ షో' గురించే మాట్లాడుకుంటున్నారు.

అంతే మరి, అప్పటిదాకా అస్సలేమాత్రం ఎక్స్‌పోజ్‌ చేయని ఓ హీరోయిన్‌, అనూహ్యంగా హాట్‌ లుక్‌తో కన్పిస్తే అలాగే వుంటుంది. పెర్ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌తోనే కాదు, హాటెస్ట్‌ లుక్స్‌తోనూ హల్‌చల్‌ చేయగలనన్న సంకేతాల్ని మాళవిక పంపింది. అయితే, మాళవిక హాట్‌ అప్పీల్‌ని కొందరు తప్పుపడ్తున్నారు. అస్సలేమాత్రం గ్లామరస్‌గా లేదనీ, వల్గర్‌గా కన్పించిందనీ మాళవిక గురించి సోషల్‌ మీడియాలో నెటిజన్లు పెదవి విరుస్తుండడం గమనార్హం. అయినా, ఈ రోజుల్లో ఎక్స్‌పోజింగ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో.

అందాల విందుని 'ఆటిట్యూడ్‌'గా అభివర్ణించేస్తున్నారు అందాల భామలు. ఇప్పటికైతే ఈ స్థాయి హాట్‌ లుక్‌తో హల్‌చల్‌ చేసిన మాళవిక నాయర్‌, అవసరమైతే బికినీల్లో కన్పించడానికీ వెనుకాడబోదేమో.! అయినా, బికినీలో కన్పిస్తే తప్పేంటట.? ఏమో, ఈ మాట మాళవిక నాయర్‌ నోట కూడా వస్తుందేమో వేచి చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS