ఆఫ్టర్‌ గ్యాప్‌ హాట్‌ బ్యూటీ ఈజ్‌ బ్యాక్‌

By iQlikMovies - June 27, 2018 - 12:38 PM IST

మరిన్ని వార్తలు

రవితేజతో 'నేలటికెట్‌' సినిమాతో తెరంగేట్రం చేసింది అందాల భామ మాళవికా శర్మ. తొలి సినిమాతోనే గ్లామర్‌ దుమ్ము దులిపేసిందీ హాట్‌ బ్యూటీ. సినిమాలో చేసిన దాని కన్నా, సినిమా ప్రమోసన్స్‌లోనే ఈ బ్యూటీ చేసిన హాట్‌ సందడి ఎక్కువని చెప్పాలి. ఈ సందడితోనే అమ్మడికి తొలి సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. అయితే చదువు కంప్లీట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చిన అవకాశాలన్నీ పక్కన పెట్టేసింది. ఈ బ్యూటీ 'లా' చదువుతోన్న సంగతి తెలిసిందే. ఎగ్జామ్స్‌ కంప్లీట్‌ అయిపోయాయి. ఇక ఇప్పుడు కెరీర్‌పై దృష్టి పెట్టేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటోంది. 

ఆల్రెడీ తెలుగు, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. అవి దాదాపు ఓకే అయిపోయినట్లే అని చూచాయగా సంకేతాలు పంపుతోంది మాళవికా శర్మ. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తెరంగేట్రం చేసిన హీరో రవితేజతోనే మరో సినిమాకి ఈ హాట్‌ బ్యూటీ సైన్‌ చేసిందట. త్వరలోనే ఆ సినిమా వివరాలు రివీల్‌ చేస్తానంటోంది మాళవికా శర్మ. స్టార్‌ హీరోల కన్నా, యంగ్‌ హీరోల సరసన అందంగా సెట్‌ అయ్యే క్యూట్‌ ఫీచర్స్‌ ఈ ముద్దుగుమ్మవి. గ్లామర్‌కి నో అబ్జెక్షన్‌. యాక్టింగ్‌ టాలెంట్‌ కూడా ఉంది. అందుకే యంగ్‌ హీరోలు ఈ ముద్దుగుమ్మతో జత కట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. 

చూడాలి మరి ఫ్రెష్‌ ఫీచర్స్‌తో మాళవిక ముందు ముందు ఎన్ని అవకాశాలు దక్కించుకుంటుందో, ఎలాంటి సక్సెస్‌లు అందుకుంటుందో.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS