మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం అమెరికాలో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రానికి సంబందించిన షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇదే పూర్తవగానే ఒక్క క్షణం ఫేం VI ఆనంద్ దర్శకత్వంలో ఒక చిత్రం లో నటించడానికి పచ్చ జెండా ఊపేశాడట.
ఇక ఈ కథ విషయానికి వస్తే, రవితేజ ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నాడు. తండ్రి మరియు కొడుకు పాత్రల్లో రవితేజ నటిస్తాడట, ఇక కథలో ట్విస్ట్ ఏంటంటే తండ్రి పాత్ర రొమాంటిక్ గా ఉంటే కొడుకు పాత్ర మాత్రం తండ్రి చేసే పనులకి ఇబ్బందులు పడే వ్యక్తిగా కనిపించనున్నాడట.
ఇటువంటి వైవిధ్యమైన కథకి డిస్కో రాజా అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట, రవితేజ సినిమాలంటేనే టైటిల్స్ ఆసక్తికరంగా ఉంటుంటాయి అదే తరహాలో ఈ చిత్రం టైటిల్ కూడా ఉండబోతున్నట్టుగా అర్ధమవుతుంది.
త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, షూటింగ్ వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.