హాట్‌ అండ్‌ స్పైసీ 'నేలటిక్కెట్టు' బ్యూటీ

మరిన్ని వార్తలు

షార్ట్‌ జీన్స్‌, స్కై బ్లూ కలర్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌లో హాట్‌ హాట్‌ పోజులిచ్చేస్తోన్న ఈ బ్యూటీ మాళవికా శర్మ. 'నేల టిక్కెట్టు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాకే గ్లామర్‌లో పీక్స్‌ స్టేజ్‌ చూపించేసింది. అయితే సినిమా ఆశించిన స్థాయిలో హిట్‌ అయ్యి ఉంటే, అమ్మడి దశ ఇంకోలా ఉండేది. కానీ అలా జరగలేదు. దాంతో రేస్‌లో కాస్త వెనకబడింది. కానీ ఆ తర్వాత 'జిగేల్‌' సినిమాలో ఛాన్స్‌ దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. అదిత్‌ అరుణ్‌ అనే కొత్త కుర్రోడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కాగా మన హాట్‌ బ్యూటీ మాళవికా శర్మ మాత్రం తెలుగులో మరిన్ని హాట్‌ హాట్‌ ఆఫర్లు దక్కించుకునే దిశగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉందట. ఓ పక్క లా స్టూడెంట్‌గా తన స్టడీస్‌ని కంటిన్యూ చేస్తూనే మరోవైపు యాక్టింగ్‌ వైపు కూడా ఇంట్రెస్ట్‌ చూపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఆటిట్యూడ్‌ని మెచ్చుకుని తీరాల్సిందేగా మరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS