టిక్కెట్లు అమ్ముతున్న రవితేజ హీరోయిన్

By iQlikMovies - May 23, 2018 - 13:19 PM IST

మరిన్ని వార్తలు

ఏదైనా సినిమా విజయం వెనుక ఆ చిత్రానికి ఎన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయి అన్న దాని పై ఆధారపడి ఉంటుంది.

అలాంటిది ఏకంగా ఒక హీరోయిన్ స్వయంగా తను నటించిన సినిమాకి సంబంధించిన టిక్కెట్లని అమ్మనుంది. ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవ్వగా ఆ హీరోయిన్ మరెవరో కాదు మాళవిక శర్మ, తను అమ్మబోయే టిక్కెట్లు ఆమె నటించిన నేల టిక్కెట్టు సినిమాకి సంబంధించినవి.

ఆ వివరాల్లోకి వెళితే, రేపు (గురువారం) హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ లో సాయంత్రం 4 గంటల నుండి 4.30గంటల వరకు మాళవిక శర్మ, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నేల టిక్కెట్టు కి సంబంధించిన టిక్కెట్లు విక్రయించనున్నారు. అయితే ఈ మధ్యలో ఇటువంటి వైవిధ్యమైన ప్రచార కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు, అందులో భాగమే ఈ నేల టిక్కెట్టు చిత్రం టిక్కెట్ల విక్రయం అని వేరేగా చెప్పక్కర్లేదు.

మరి ఇటువంటి ప్రచార కార్యక్రమాలు ఈ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడేతాయో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS