మహానటి చిత్రంతో ఇప్పటితరానికి జెమిని గణేషన్ గురించిన వివరాలు తెలిసాయి. అయితే ఆయన తన జీవితంలో మూడు పర్యాయాలు వివాహం చేసుకోవడంతో ఆయన జీవితం పైన అందరికి ఎక్కడ లేని ఆసక్తి పెరిగింది.
ఇక ఈ మధ్యనే ఆయన గురించిన వ్యక్తిగత విషయాలకి సంబంధించిన వార్తలకి, ఫొటోలకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ తరుణంలో ఆయనకి ఉన్న 8 మంది సంతానంలో 7గురు ఆడపిల్లలు కావడం విశేషం.
అయితే ఆయన పిల్లలు ఇప్పటికి ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండటం విశేషం. ఇక ఆడపిల్లలు అంతా కలిసి ఒకటే ఫ్రేమ్ లో కలిసి ఫోటో దిగడం ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో జెమిని గణేషన్ సంతానమైన్ ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారు, ఇందులో నటి రేఖ కూడా ఉన్నారు.
ఏదేమైనా.. సావిత్రి బయోపిక్ ద్వారా జెమిని గణేషన్ జీవితం కూడా తెరపైకి వచ్చేసింది.