ఆర్ఆర్ఆర్ మూవీ తరవాత మూడేళ్ళకి థియేటర్స్ లో సందడి చేసిన ఎన్టీఆర్ 'దేవర'తో సోలోగా పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. దేవర తరవాత స్పీడ్ పెంచి వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే వార్ 2 షూటింగ్ షెడ్యూల్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ తో ఒప్పుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు టాక్. ప్రస్తుతం హాలిడే మూడ్ లో ఉన్న ఎన్టీఆర్ సంక్రాంతి తరవాత రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. ఈ మూవీకి 'డ్రాగన్' అనే పేరు పరిశీలనలో ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కే ఈ మూవీలో మొదట రష్మిక మందన్న ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం సప్తస్వరాలు దాటి ఫేమ్ రుక్మిణీ వసంత్ ఫిక్స్ అయింది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉండటం వలన రష్మిక కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావటం వలన అన్ని భాషల స్టార్స్ కి ఛాన్స్ ఇస్తుంటారు. సలార్ లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ స్టార్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇపుడు కూడా ఎన్టీఆర్ మూవీలో అన్ని భాషల స్టార్స్ ని రంగంలోకి దింపుతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ క్రమంలో కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ కి చోటు దక్కింది. రష్మిక కూడా కన్నడ నటి అయినా పాన్ ఇండియా హీరోయిన్ గా సత్తాచాటుతోంది. వీరు కాకుండా ఇద్దరు మల్లు యాక్టర్స్ కి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు నీల్. ఒకరు బీజూ మీనన్, మరొకరు టొవినో థామస్. మలయాళంలో మంచి స్టార్ డమ్ ఉన్న ఈ ఇద్దరు ఎన్టీఆర్ మూవీలో నటించటంతో మలయాళంలో ఈ మూవీకి కావాల్సినంత బజ్ దొరికింది.
ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, నటీనటులను ఎంపిక చేసి ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాడు నీల్. ఇక ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గోవటమే ఆలస్యం. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. 2026 సంక్రాంతిని టార్గెట్ చేసారు ఎన్టీఆర్, నీల్. 2025 లో 'వార్ 2'తో ఫాన్స్ ని అలరిస్తున్నాడు ఎన్టీఆర్.