‘మళ్లీ రావా’ చిత్రంలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కనిపించిన చిన్నారి గుర్తుంది కదా.. మర్చిపోయేలా పర్ఫామెన్స్ ఇచ్చిందా? అదరగొట్టేసింది. ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్గా మారింది. పేరు ప్రీతి అస్రాని. ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాతో తొలిసారి హీరోయిన్గా డెబ్యూ చేస్తోంది. సాయు రోనక్, ప్రీతి అస్రాని జంటగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీతి కొన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు మనతో షేర్ చేసుకుంది. సీరియల్ ఆర్టిస్ట్ కూతురుగా యాక్టింగ్‌పై చిన్నతనం నుండే ఆసక్తి పెంచుకుంది ప్రీతి అస్రాని. ఆ ఆసక్తితోనే కొన్ని షార్ట్ ఫిలింస్‌లో నటించింది. ‘మళ్లీ రావా’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు దక్కించుకుంది.
హీరోయిన్‌గానూ భవిష్యత్‌లో మంచి పేరు దక్కించుకుంటానని నమ్మకం వ్యక్తం చేస్తోంది. ‘ప్రెజర్ కుక్కర్’ సినిమా విషయానికి వస్తే, బీటెక్ చేసిన యువత తల్లితండ్రులు తమ పిల్లలు అమెరికాలోనే స్ధిరపడాలని కోరుకుంటున్నారు. ఆ కారణంగా వారు ఎలాంటి ఒత్తిడులు ఎదుర్కొంటున్నారు.? ఏం కోల్పోతున్నారన్న ప్రజెంట్ సొసైటీ సిట్యువేషన్‌ని కథాంశంగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. ఖచ్చితంగా యూత్‌తో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగ్గ అంశాలతో రూపొందిన ఈ సినిమాతో ముద్దుగుమ్మ ప్రీతి అస్రాని ఎలాంటి గుర్తింపు దక్కించుకుంటుందో చూడాలి.
అన్నట్లు ఈ భామ ఖాతాలో మరో సినిమా కూడా ఉంది. గోపీచంద్ ` తమన్నా జంటగా రూపొందుతోన్న ‘సీటీమార్’లో కబడ్డీ టీమ్ కెప్టెన్‌గా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తొంది. మరిన్ని క్రేజీ ఆఫర్స్ తలుపు తడుతుండడంతో, ఇన్ ఫ్యూచర్ ప్రీతి ఫుల్ బిజీ అయిపోతుందేమో.