ఏంటి సాబ్‌.. ఈ గందరగోళం.?

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ మూవీ ‘పింక్‌’ రీమేక్‌కి ‘లాయర్‌ సాబ్‌’, ‘వకీల్‌ సాబ్‌’ అనే పేర్లు టైటిల్స్‌గా వినిపిస్తున్నాయి. మొదట్లో ‘లాయర్‌ సాబ్‌’ టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది. ఈ టైటిల్‌తో ఫ్యాన్స్‌ పోస్టర్లు కూడా క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసేశారు. ఇప్పుడేమో ‘వకీల్‌ సాబ్‌’ అంటున్నారు. ‘సాబ్‌’ అయితే కన్‌ఫామ్‌ అయ్యింది. కానీ, లాయరా.? వకీలా.? అని తేలాల్సి ఉంది. మార్చి 21న ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేస్తామని నిర్మాత దిల్‌ రాజు చెప్పాడు.

 

ఈ లోగా టైటిల్‌పై గందరగోళం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే టైటిల్‌పై క్లారిటీ ఇవ్వాలని దిల్‌ రాజు అనుకుంటున్నారట. సైలెంట్‌గా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మే లో రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘పింక్‌’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అంజలి, నివేదా థామస్‌ అనదర్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్న ఈ సినిమాకి యంగ్‌ డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ క్రిష్‌ సినిమా కోసం మేకోవర్‌ అవుతున్న సంగతి తెలిసిందే. మొగలు కాలం నాటి బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS