బుసలు కొడుతున్న సొగసులు

మరిన్ని వార్తలు

వయసు మీద పడ్తున్నా వన్నె తగ్గని అందం మల్లికా షెరావత్‌ సొంతం. 'మర్డర్‌' సినిమాతో బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన ఈ భామ, ఈ మధ్య సినిమాల్లో కన్పించడం తగ్గించేసినా సోషల్‌ మీడియాలో మాత్రం తన హవా చాటుతూనే వుంది. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. వయసు మీద పడినా, సొగసుల్లో ఏమాత్రం మెరుపు తగ్గలేదని ఈ ఫొటోని చూశాక ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సినిమాలు తగ్గినా, సినీ పరిశ్రమ నుంచి దూరమవలేదని చెబుతున్న మల్లికా షెరావత్‌, మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానంటోంది. ఐటమ్‌ సాంగ్స్‌ చేయడానికి సైతం తాను సిద్ధంగా వున్నానంటోందిగానీ మల్లికా షెరావత్‌కి ఛాన్సులిచ్చేవారు కరవయ్యారు. సౌత్‌లోనూ ఈ బ్యూటీ ప్రయత్నాలు షురూ చేసిందట. సోషల్‌ మీడియాలో ఫొటోల వరకూ ఓకేగానీ, సినిమాల్లో మళ్ళీ జోష్‌ దక్కాలంటే.. సరైన విజయం ఆమె ఖాతాలో పడాలి మరి. అప్పటిదాకా సోషల్‌ మీడియాలో ఈ విందు ఇలాగే కొనసాగుతుందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS