యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకి గుడ్ న్యూస్.. ఓ తీపి కబురు.. అంటూ ఊరించి ఊరించి.. ఎట్టకేలకు తొలి 'సింగిల్' బయటకు వచ్చింది. 'అనగనగా..' అంటూ సాగే పాటని నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ విడుదల చేసింది.
తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందడంతో తీవ్ర ఆవేదనలో వున్నప్పటికీ యంగ్ టైగర్ ఎన్టీఆర్, 'అరవింద సమేత' సినిమా షూటింగ్‌ని ఆపనివ్వలేదు. సినిమా పట్ల అతని కమిట్‌మెంట్ అలాంటిది. నిజానికి, భారీ హంగుల నడుమ ట్రైలర్‌ని, అలాగే ఆడియో రిలీజ్ ఫంక్షన్‌నీ చేయాలనున్నా.. హరికృష్ణ మరణం కారణంగా, ఆ సంబరాల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆడియో సింగిల్‌ని విడుదల చేయడం ద్వారా, సినిమాపై అభిమానుల ఎదురుచూపులకు కాస్తంత ఊరటనిచ్చినట్లయ్యింది.
ఆ సంగతి పక్కన పెడితే, దసరా బరిలో నిలిచిన 'అరవింద సమేత' సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ టేకింగ్, డైలాగులతో 'అరవింద సమేత' వసూళ్ళ ప్రభంజనమే సృష్టించబోతోందనే ధీమాతో వున్నారు నిర్మాత. సునీల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కన్పించనున్న సంగతి తెల్సిందే.
నాగబాబు, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సీన్స్‌కి సంబంధించి లీక్ అయిన కొన్ని ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసేస్తున్నాయి. మొత్తమ్మీద, వస్తూనే 'అరవింద సమేత' ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాలో సంచలనాలు షురూ చేసేసింది.