గ్లామ్‌షాట్‌: మత్తెక్కించే 'నేలటిక్కెట్‌' హాట్‌నెస్‌!

By iQlikMovies - May 27, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

'నేల టిక్కెట్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ముద్దుగుమ్మ మాళవికా శర్మ. తొలి సినిమాతోనే అమ్మడు ఎంత చేయాలో అంతగా అందాల రచ్చ చేసేసింది. ఆ మాటికొస్తే, చేయాల్సినదాని కన్నా, కూసింత ఎక్కువే చేసేసిందీ అమ్మడు. ఎంత చేస్తే మాత్రం అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఆ సినిమా టైంలో పిచ్చెక్కించే గ్లామర్‌తో కుర్రోళ్లను ముగ్గులోకి దించేసింది. కానీ, మరో ఛాన్స్‌ దక్కితేనే కదా ఆ అందాలకు మరింత పదును. ఆ అవకాశానికి మాళవిక దూరమైంది. దాంతో రేస్‌లో వెనకడిపోయింది.

 

తెరపై గ్లామర్‌ ప్రదర్శనకు అవకాశమే లేకపోయినా, సోషల్‌ మీడియా తెరపై అమ్మడి హాట్‌ హాట్‌ వడ్డన మాత్రం అన్‌ లిమిటెడే అని చెప్పక తప్పదు. తాజాగా మాళవిక పోస్ట్‌ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పిక్‌లో ఈ బ్యూటీ హాట్‌నెస్‌కి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే, సన్నీలియోన్‌ని మరిపించే గ్లామర్‌ అంటూ పొగడ్తల వంటి ఇంకేవో అస్త్రాలు సంధిస్తున్నారు కూడా. ఏ మాటకామాటే చెప్పుకోవాలి గ్లామర్‌లో మాళవికా టాప్‌ అని ఇంకోసారి ప్రూవ్‌ అయ్యింది ఈ పోజుతో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS