'నేల టిక్కెట్టు' సినిమాతో హీరోయిన్గా క్యూట్ ఎంట్రీ ఇచ్చింది. హాట్‌గా హాట్‌గా ప్రమోట్ అయ్యింది అందాల మాళవికా శర్మ. కానీ, ఆ క్యూట్కీ, అమ్మడి అందాల హీట్కీ ఆడియన్స్ నుండి రావల్సిన రెస్పాన్స్ వచ్చినా, కావల్సిన స్థాయిలో అది కనెక్ట్ కాలేదు. దాంతో అమ్మడి అందాలను ఇంకోస్సారి.. అనేలా మళ్లీ చూసే అవకాశం లేకుండా పోయింది. వన్ అండ్ ఓన్లీ ఛాన్స్‌తో పక్కకు తప్పుకోవల్సి వచ్చింది. అయితే, ఈ అందాల భామ అప్పుడప్పుడూ తన అందాలను సోషల్ మీడియాలో ప్రదర్శనకు పెట్టి, తనదైన శైలిలో పబ్లిసిటీ చేసుకుంటూనే ఉంది.
అలా అమ్మడిని ఆడియన్స్ మర్చిపోయినా, నెట్టింట్లో నెటిజన్లు మాత్రం మర్చిపోలేదు. తన అందాల్ని ఆస్వాదించే ఆ నెటిజన్స్ కోసమే, లేటెస్ట్గా ఓ హాట్ పిక్ ఒకటి నెట్టింట్లో సుతారంగా వదిలిపెట్టింది అందాల మాళవిక. బ్లాక్ కలర్ టూ పీస్ బికినీ ధరించి, బీచ్‌లో అలా నడుచుకొస్తోంది. నడక కాదులెండి పరుగే. ఆ పరుగులో టాప్ లెవల్ అందాలు కనిపించేలా, పైన ధరించిన వైట్ షర్టు బటన్స్ డీప్‌గా వదిలేసింది. కాళ్లకు వేయాల్సిన చెప్పులు చేతిలో పట్టుకుని, కళ్లకు గాగుల్స్ పెట్టి, హాయిగా నవ్వులు చిందిస్తోంది. ఈ లేలేత అందాల్ని మీరూ ఆస్వాదించాలంటే ఈ పిక్‌పై ఓ లుక్కేస్కోవాల్సిందే.