కోలీవుడ్‌కి కైరా అద్వానీ.?

మరిన్ని వార్తలు

'భరత్‌ అనే నేను' చిత్రంతో తెరంగేట్రం చేసి, తెలుగు ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మ కైరా అద్వానీ. ఆ తర్వాత చరణ్‌తో 'వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. ఆ పై బాలీవుడ్‌లో రీమేక్‌ అయిన 'అర్జున్‌ రెడ్డి' సినిమా 'కబీర్‌సింగ్‌'లో ఛాన్స్‌ దక్కించుకుంది. ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో, కైరా అద్వానీ అక్కడ స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది.

 

ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో ఊపిరి పీల్చుకోలేనంత బిజీ అయిపోయింది కైరా అద్వానీ. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు రావడంతో, టాలీవుడ్‌లో సైన్‌ చేయాల్సిన కొన్ని ప్రెస్టీజియస్‌ ప్రాజెక్టులు సందిగ్ధంలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, తాజాగా కోలీవుడ్‌లో కైరా అద్వానీ కాలు మోపనుందనే టాక్‌ వినిపిస్తోంది. ఇళయ దళపతి విజయ్‌ తాజా చిత్రం కోసం కైరా అద్వానీని హీరోయిన్‌గా ఎంచుకున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

 

తొలి సినిమాకే స్టార్‌ హీరో విజయ్‌తో ఛాన్స్‌ రావడమంటే గ్రేట్‌ కదా. సో ఈ గోల్డెన్‌ ఆఫర్‌ని కైరా అద్వానీ వదులుకుంటుందా? వదులుకునే ఛాన్సే లేదంటున్నారు. అయితే, బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేతిలో ఉంటేనే, సౌత్‌ సినిమాల్లో నటించడం చాలా కష్టం. అలాంటిది ఐదారు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కైరా అద్వానీ, విజయ్‌ సినిమా కోసం డేట్స్‌ ఎలా అడ్జస్ట్‌ చేసుకుంటుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS