తెలుగు చిత్రసీమలో ఇప్పుడు బయోపిక్ ల హవా నడుస్తున్నది. ఇప్పటికే ఎన్టీఆర్ జీవితం పైన మూడు నాలుగు బయోపిక్స్ కూడా రాబోతున్నాయి. ఇవ్వన్ని అటుంచితే ఉమ్మడి అంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి అయిన Dr రాజశేఖర్ రెడ్డి జీవితం పైన ఒక బయోపిక్ ఇప్పుడు రానుందట.
అయితే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ఆనందోబ్రహ్మ చిత్ర నిర్మాత అయిన విజయ్ ముందుకి రావడం అలాగే ఈ సినిమాకి సంబంధించి రాజశేఖర్ రెడ్డి కుమారుడు అయిన జగన్ నుండి అనుమతి కూడా తీసుకున్నాడట. అయితే ఈ సినిమాకి దర్శకత్వం ఎవరు వహిస్తారు అన్న విషయాల పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలావుండగా ఈ సినిమాలో ప్రధాన పాత్రకి అదే రాజశేఖర్ రెడ్డి పాత్రకి మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి కనిపిస్తారని ఒక వార్త ఇప్పుడు సంచలనంగా ఉంది. అయితే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అయితే కొన్ని సంవత్సరాల క్రితం, రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని తెరకెక్కించడానికి హీరో రాజశేఖర్ ప్రయత్నించడం, దానిని దర్శకత్వం వహించేందుకు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా ముందుకు రావడం జరిగింది. కొన్ని బయటకి తెలియని కారణాలతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
మరి ఇప్పుడైనా ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనేది చూడాలి.