మనమే మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: మనమే
దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

నటీనటులు: శర్వానంద్, కృతిశెట్టి, ఆయేషా ఖాన్, వెన్నెల కిశోర్, సుదర్శన్, శివ కందుకూరి,  సచిన్ ఖేడేకర్, ముఖేష్ రుషి, తులసి. త్రిగున్  
        
రచన - కథ : శ్రీరామ్ ఆదిత్య 
నిర్మాతలు:  టీజీ విశ్వ ప్రసాద్ , వివేక్ కూచి బోట్ల   

ఆర్ట్ డైరెక్టర్ : జానీ షేక్
సంగీతం: హేశం అభ్దుల్ వహాబ్  
ఛాయాగ్రహణం:  విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్.
కూర్పు : ప్రవీణ్ పూడి


బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ    
​విడుదల తేదీ: 7 జూన్  2024

 
ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5


టాలీవుడ్ లో టైర్ టూ హీరోగా కొనసాగుతున్న శర్వానంద్ కెరియర్  మొదటి నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. యంగ్ హీరో అయినా తన స్థాయికి, వయసుకి తగ్గ లవర్ బాయ్ ఇమేజ్ లో ఇరుక్కోకుండా, అన్ని రకాల పాత్రలు చేస్తూ తగిన గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వా నంద్ ఓవర్ నైట్ స్టార్ అయిపోలేదు. చిన్న చిన్న క్యారక్టర్స్ చేస్తూ  హీరోగా ఎదిగాడు. ఈ మధ్య కాలంలో  శర్వా నంద్ కి సరైన హిట్ పడలేదు. ఇప్పడు తన కెరియర్ కి ఒక విజయం చాలా అవ‌స‌రం. 2022 లో ఒకే ఒక జీవితం`తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరవాత `మనమే అనే చిత్రంతో నేడు థియేటర్స్ లోకి వచ్చాడు. ఈ మూవీ మొదలైన దగ్గరనుంచి విడుదలవరకు ఎలాంటి హడావుడి లేకుండా, కామ్ గా జరిగిపోయింది. మ‌రి మనమే మూవీ శర్వాకి హిట్ తెచ్చిందా లేదో ఈ రివ్యూ లో చూద్దాం.        

 

కథ :   

విక్రమ్(శర్వానంద్) లండన్ లో ఉంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు.  విక్రమ్, క్లోజ్ ఫ్రెండ్ అనురాగ్(త్రిగుణ్ ) ఒక అనాథ. అనురాగ్, అతని భార్య శ్వేత (మౌనిక) ఒకసారి ఇండియాకి వస్తారు. ఇండియాలో ఓ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతారు. దీనితో వీళ్ళ అబ్బాయి ఖుషి (విక్రమ్ ఆదిత్య) అనాథ అవుతాడు. శ్వేత తల్లితండ్రులు తమకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకుందని, వారికి పుట్టిన బాబుని కూడా ద‌గ్గ‌ర‌కు రానివ్వరు. అలా అనాథగా మిగిలిపోయిన ఖుషిని శ్వేత ఫ్రెండ్ సుభద్ర (కృతి శెట్టి) దత్తత తీసుకోవాలని అనుకుంటుంది. కానీ ఖుషి ఇంగ్లాండ్ లో పుట్టటం వలన అక్కడి పౌరసత్వం ఉండటంతో ఇండియాలో ఉన్న సుభద్ర దత్తత తీసుకోవటానికి కొన్ని రూల్స్ అడ్డువస్తాయి. ఆ రూల్స్ ప్రకారం నాలుగు నెలలు పేరెంట్స్ లా కేర్ టేకర్స్ చూసుకోవాలి లేదా ఇంగ్లాండ్ ప్రభుత్వం అనాధగా భావించి ఏదైనా ఆర్ఫనేజ్ లో అప్పచెప్పేస్తారు. ఈ విషయం తెలిసిన విక్రమ్ తన ఫ్రెండ్ లా వాడి కొడుకు కూడా అనాథలా పెరగటం ఇష్టం లేక  సుభద్రతో కలిసి లండన్ లో బాబుని చూసుకోడానికి ఫిక్స్ అవుతాడు. సుభద్రకు ఇది వరకే కార్తీక్ తో(శివ కందుకూరి) నిశ్చితార్థం జరుగుతుంది. దాంతో సుబద్ర లండన్ వెళ్లి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది. కార్తీక్ తో నిశ్చితార్ధం అయిన సుభద్ర విక్రమ్ తో ఎలా మసలుకుంది. విక్రమ్, సుభద్ర బాబుని ఎలా చూసుకున్నారు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పటివరకు ఆకతాయిగా తిరిగిన విక్రమ్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. తనకి కాబోయే భార్యని వేరొకరితో ఉండటానికి కార్తీక్ ఒప్పుకున్నాడా? వీరి జీవితాలు చివరికి ఏ మలుపులు తీరుగుతాయో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.  

 

విశ్లేషణ: 

ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించటంలో శర్వానంద్ ఎప్పుడూ ది బెస్ట్ గా ఉంటాడు. పిల్లలు, పెద్దలు అంతా మెచ్చే విధంగా ఉంటాయి శర్వా మూవీస్. మనమే సినిమా కూడా ఫ్యామిలీ అంతా కలిసి చూసి, హాయిగా నవ్వుకునే విధంగా ఉంది. కృతి శెట్టి, శర్వా జోడి చాలా బాగుంది. శర్వా కెరియర్ లో ఎన్నో విభిన్న పాత్రలు చేసాడు. మనమే సినిమాలో చేసిన విక్రమ్ పాత్ర కూడా అలాంటిదే. ఒక డిఫరెంట్ జానర్ అనే చెప్పాలి. కామెడీ ఎంటర్ టైనర్‌ గా తెరకెక్కిన మనమే ఎమోషనల్ గా కూడా పరవాలేదనిపించుకుంది. ఈ మూవీలో 16 పాటలు అని చెప్పగానే ఆమ్మో అన్ని పాటలా అనుకున్నారు ప్రేక్షకులు కానీ పాటలు సెపరేట్ గా వస్తున్న ఫీలింగ్ ఉండదు. కథకి అనుగుణంగానే పాటలు రన్ అవుతుంటాయి. 'జాను' సినిమాలో శర్వా లుక్ అస్సలు బాలేదు. బాడీ షేప్ అవుట్ అయిపోయి చాలా పెద్ద వాడిలా అనిపించాడు. తరవాత వచ్చిన 'ఆడాళ్ళు మీకు జోహార్లు' సినిమాలో కూడా అలానే ఉన్నాడు. మళ్ళీ శర్వా మాములుగా అవటం కష్టం అనుకున్నవారికి ఇందులో శర్వా లుక్స్ చూసి షాక్ అవుతారు. శర్వానంద్ లుక్ పరంగా చాలా స్టైల్ గా, స్మార్ట్ గా ఉన్నాడు. యాక్షన్ కూడా అదరగొట్టాడు. గతంలో వచ్చిన, రన్ రాజా రన్, పడి పడి లేచే మనసు, ఎక్సప్రెస్ రాజా సినిమాల తరహాలో ఎనర్జిటిక్ గా ఉంది. కామెడీ టైమింగ్ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. కొన్ని చిన్న చిన్న డైలాగ్స్ చాలా ఆకట్టుకున్నాయి. కృతి డేరింగ్ స్టెప్ వేసి ఈ పాత్ర చేయటానికి ఒప్పుకుంది. హీరోయిన్ ఇమేజ్ కోసం, గ్లామర్ కోసం చూడకుండా అభినయానికి ప్రాధాన్యత ఉండే ఇలాంటి పాత్ర చేయటం విశేషమే. ఒక చిన్న పిల్లాడి భవిష్యత్తు కోసం, పెళ్లికాని ఇద్దరు బాధ్యత తీసుకుని ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే అంశాన్ని కామెడీ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. చిన్న బాబుకి తల్లిదండ్రులుగా శర్వానంద్ కృతి శెట్టి నటించిన తీరు అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. ఎమోషన్ ఇంపాక్ట్ తగ్గినా కామెడీతో ప్రేక్షకుల్ని అలరించారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న భావోద్వేగాలు, పిల్లల పెంపకంలో ఉన్న సరదా, తెలియని ఉద్వేగాలను తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంది. శర్వానంద్, కృతి శెట్టి పాత్రలు టామ్ అండ్ జెర్రీ తరహాలో కొట్టుకోవటం ఫన్నీగా ఉంది.

 

నటీ నటులు: 

శర్వా నంద్ నటన బాగుంది. కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో శర్వా నటనలో చాలా ఈజ్ కనపరిచాడు. లుక్స్ తో, నటనతో శర్వా మరొకసారి హైలెట్ గా నిలిచాడు. శర్వా ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉంది ఈ మూవీలో తన నటన.  కృతి శెట్టి ఉప్పెన తరవాత ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసింది. అందం, అభినయం రెండిటితో కృతి ఆకట్టుకుంది. దర్శకుడి ఎవరి దగ్గరనుంచి నటన ఎంత వరకు రాబట్టలో అంతవరకూ సక్సెస్ అయ్యాడు. ఖుషి పాత్రలో నటించిన విక్రమాదిత్య నటన సహజంగా ఉంది. ఇండస్ట్రీకి ఇంకో బాలనటుడు దొరికినట్టే. రాహుల్ రవీంద్ర విలనిజానికి ఇంకొంచెం స్కోప్ ఉంటే బాగుండేది. శివ కందుకూరి తన పాత్ర పరిధి వరకు పరవాలేదనిపించుకున్నాడు. ఆయేషా ఖాన్, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ కామెడీతో ఆకట్టుకున్నారు. మిగతా పాత్రల్లో సచిన్ ఖేడేకర్, తలసి, ముఖేష్ రుషి, సీత తమ పాత్రల పరిధి మేరకు చేశారు. త్రిగుణ్ గెస్ట్ రోల్ లో మెరిసి మాయ మయ్యారు. 

 

టెక్నికల్:  

ఒక సాధారణ కథ తీసుకుని ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా చెప్పటంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య విజయం సాధించాడు అనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి రిలేటెడ్ గా అనిపించే ఈ కథలో హీరో హీరోయిన్స్ ని ఎంచుకోవటం లోనే దర్శకుడు సగం సక్సెస్ అయ్యాడు. ఈ మూవీకి వీరిద్దరూ పర్ఫెక్ట్ జోడి అనిపించేలా ఉన్నారు. కొత్త కాంబినేషన్ కావటంతో వీరి జోడికి మంచి మార్కులే పడ్డాయి.  సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. లండన్ లో చాలా సినిమాలు చిత్రించి ఉండొచ్చు కానీ ఈ మూవీలో లండన్ లొకేషన్స్ చాలా అందంగా చూపించారు విష్ణు శర్మ. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతున్న హేశంకి ఇదో మంచి పేరు తెచ్చిపెడుతుంది.  16 పాటలకి అందించిన సంగీతం బాగుంది.  ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.  

 

ప్లస్ పాయింట్స్

శర్వానంద్, కృతిశెట్టి 
కామెడీ
విజువల్స్   


మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్ 

 

ఫైనల్ వర్దిక్ట్ : ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ డ్రామా..

ALSO READ : IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS