గత మూడు నాలుగు నెలలుగా షూటింగులు లేవు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు. లాక్ డౌన్ ఆంక్షలను సడలించినప్పటికీ బయట పెద్దగా కనిపించడం లేదు. స్టే హోమ్ స్టే సేఫ్ నినాదం పాపులర్ చేస్తున్నారు.
నటి, హోస్ట్ మంచు లక్ష్మి కూడా ఇవన్నీ చేస్తున్నారు కానీ ఈమధ్య ఒక పిక్నిక్ కు వెళ్లారట. మంచు కుటుంబం పిల్లలతో ఒక లాన్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు. అలా గడిపిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలకు "మంచు మినీస్ తో అవుట్ డోర్ పిక్నిక్ ను ఎంజాయ్ చేస్తున్నా! అంటూ ఓ సూపర్ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ ఫోటోలో మంచు లక్ష్మి కూతురు తో పాటుగా మంచు విష్ణు పిల్లలు కూడా ఉన్నారు. అందరూ చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులివ్వడం విశేషం. ఈ ఫోటోలను నెటిజన్ల నుండి భారీ స్పందన దక్కింది. చాలామంది నెటిజన్లు మంచు లక్ష్మి చిన్న పిల్లలతో సరదాగా గడపడాన్ని మెచ్చుకున్నారు. కొంతమంది లొకేషన్ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు.