'మంచు లక్ష్మి' పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నిర్మాతగా, నటిగా, హోస్ట్ గా, యాంకర్ గా పలురంగాల్లో సత్తాచాటి సౌత్ లో మంచి గుర్తింపుతెచ్చుకుంది. సమాజ సేవకురాలిగా కూడా లక్ష్మి పేరు తరచుగా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో తనపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ ని కూడా తాను ఆస్వాదిస్తానని, అవే తన బలం అని ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చి పలువురుని ఆకట్టుకుంది. రీసెంట్ గా లక్ష్మి ముంబై కి షిఫ్ట్ అయ్యింది. తమిళం, మలయాళం, తెలుగులో సినిమాలు చేస్తూ, ఇక్కడ ఉండకుండా ముంబైకి ఎందుకు షిఫ్టు అవుతోందని అనుకున్నారు.
రీసెంట్ గా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ మంచు లక్ష్మి తన కుటుంబం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన కెరీర్‌కు తన కుటుంబమే అడ్డుపడుతుందంటూ, సౌత్ లో స్టార్ కిడ్ అయినా అమ్మాయిలకి అంత ఈజీగా ఆఫర్స్ రావని వారి మనుగడ కష్టం అని కామెంట్ చేసింది. అప్పటికే తండ్రో, అన్నో, తమ్ముడో, ఇండస్ట్రీలో ఉండటం వలన తమకి ఎవరు అవకాశాలు ఇవ్వరని ఓపెన్ గా చెప్పింది. దేశం మొత్తం పితృస్వామ్య వ్యవస్థ నడుస్తోంది అని, అందులో నేను కూడా ఓ బాధితురాలినే అని వాపోయింది. విష్ణు, మనోజ్ వాళ్ళ కెరియర్ లో ఈజీగా సాదించిన విజయాలను, నేను సాదించటానికి చాలా కష్టపడ్డాను అని పేర్కొంది. పైగా నేను సినిమాల్లోకి రావటం మోహన్ బాబుకి ఇష్టం లేదని, ఎన్నో అవాంతరాలను దాటుకుని నేను బయటికి వచ్చానని, అప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నానని, నా కెరీర్‌కి, జీవితానికి నా కుటుంబమే అడ్డుపడుతుందని నిర్భయంగా నిజాన్ని మీడియా ముందు వెల్లడించింది.
తాను బయటకి రావాలన్నా వంద పర్మిషన్ లు ఉండాలని, ఈ క్రమంలోనే ముంబైకి రావటానికి కూడా ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదని, డిస్కరేజ్ చేశారని లక్ష్మి చెప్పింది. వారి భయాల కారణంగా జీవితంలో ఏదీ సాధించలేకపోయాననీ ఆమె బాధ పడింది. రకుల్ ప్రీత్ సింగ్ వలనే ముంబైకి షిఫ్ట్ అయినట్టు పేర్కొంది. కెరియర్ బాగుండాలంటే హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళమని రానా కూడా సజెస్ట్ చేసాడని లక్ష్మి చెప్పింది. కుటుంబం పై లక్ష్మి చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. లక్ష్మి ఏం మాట్లాడినా ట్రోల్స్ చేసే వారు కూడా ఈ మాటలు విని షాక్ అవుతున్నారు.