మంచు మనోజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆయన వివాహం శుక్రవారం రాత్రి భూమా మౌనిక తో వేడుకగాజరిగింది. ఫిలింనగర్‌లోని మోహన్‌బాబు నివాసంలో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్, మౌనిక ఒక్కటయ్యారు.
మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తెనే మౌనిక. ఆమెతో కథానాయకుడు మనోజ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. రెండు కుటుంబాల అంగీకారంతో ఈ జంట ఒక్కటైంది. ఈ ఇద్దరికి ఇది రెండో వివాహమే.గతంలో మనోజ్ కు ప్రణతీరెడ్డితో వివాహమైంది. అయితే పరస్పర అంగీకారంతో 2019లో వీరిద్దరూ విడిపోయారు. ఇప్పుడు మౌనిక తో కొత్త జీవితం ప్రారంభించారు మనోజ్.