క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా, బ్యూటిఫుల్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, S.K. సత్య తెరకెక్కిస్తున్న చిత్రం గుంటూరోఉ. ఈ సినిమా చిత్రీకరణ అంతా పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టేసింది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అశేష స్పందన లభిస్తుంది. మనోజ్ గత చిత్రాలను మైమరింపచేసేలా, ఈ మాస్ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాత వరుణ్ అట్లూరి మాట్లాడుతూ - ``లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న మా గుంటూరోడు చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. సినిమాలో మనోజ్ యాక్షన్ తో ప్రేక్షకులను అలరిస్తారు. మనోజ్, ప్రగ్యా జైస్వాల్,S.K. సత్య లతో సహా యూనిట్ అందరి సపోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయగలిగాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెలాఖరులో ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ఫిభ్రవరి రెండవ వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కార్యక్రమంలో మనోజ్ బాబు తో పాటు, సినీ యూనిట్ అంతా పాల్గొన్నారు.
ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్, పృథ్వి ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.