జల్లికట్టు కోసం ఏ ఆర్ రెహమాన్ వినూత్న నిరసన!

మరిన్ని వార్తలు

జల్లికట్టు పై బ్యాన్ ఎత్తివేసే అంతవరకు తమిళ ప్రజలు తమ నిరసనలు కొనసాగించేలా ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ రేపు మొత్తం ఆహరం తీసుకోకుండా జల్లికట్టు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమానికి తనవంతుగా ఇలా నిరసన తెలియచేయనున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ నిరసన సెగలు దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకాయి. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధానమంత్రి మోడీని కలిసి తమిళనాట ప్రస్తుతమున్న పరిస్థితిని వివరించారు.మొత్తానికి జల్లికట్టు అంశం ఇప్పుడు దేశస్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS