చార్మింగ్ స్టార్ శ్రీకాంత్ తన 126వ చిత్రంగా ‘రారా’ అనే హారర్ చిత్రం నేడు విడుదలకానుంది.
ఇక తన తదుపరి చిత్రం ‘ఆపరేషన్ దుర్యోధన 2’ చిత్రానికి సంబందించిన ఒక కీలక సమాచారం బయటకి వచ్చింది. ఆ సమాచారం ఏంటంటే- మంచు మనోజ్ కుమార్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించనున్నాడట. దీనితో ఈ చిత్రం పైన ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
ఈమధ్యకాలంలో శ్రీకాంత్ తన కెరీర్ లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కథ, కథనం అలాగే తన పాత్రతో పూర్తిగా సంతృప్తి చెందితేనే సదరు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఇది కూడా ఆ కోవలోకే వస్తుంది అని అందరు భావిస్తున్నారు.
ఇప్పటికే ఆపరేషన్ దుర్యోధన చిత్రం శ్రీకాంత్ కెరీర్ లోనే ఒక ప్రముఖమైన చిత్రంగా మిగిలిపోవడం అలాగే రచయత-దర్శకుడు పోసాని కృష్ణమురళికి కూడా ఇది ఒక ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది.