పవన్‌కి జై కొట్టిన మంచు వారబ్బాయ్‌

మరిన్ని వార్తలు

సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పవన్‌ స్పందించిన తీరు తనను ఆకట్టుకుందని, ఈ విషయంలో పవన్‌ కళ్యాణ్‌ వెంట తాను సిద్ధమనీ సినీ పరిశ్రమ మాత్రమే కాదు, వివిధ రంగాల్లో మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి అండగా ఉండేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మనోజ్‌ చెప్పాడు. 

అలాగే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ప్రత్యేక హోదా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. సోషల్‌ మీడియాలో ఈ సందర్భంగా సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టాడు మంచు మనోజ్‌. ఇదిప్పుడు వైరల్‌గా మారింది. మంచు ఫ్యామిలీ హీరోల్లో మంచు మనోజ్‌ది ఓ డిఫరెంట్‌ నేచర్‌. హీరోగానైనా ఆయన ఆలోచనలు సరికొత్తగా ఉంటాయి. కమర్షియల్‌ అంశాలకు దూరంగా, సమాజానికి ఏదో చేయాలనే తపనతో సినిమాలు ఎంచుకుంటూ ఉంటాడు. అలాగే సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు. అందుకే మంచు మనోజ్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది చాలామందికి. 

ఇప్పుడు పవన్‌ చేస్తున్న ఉద్యమానికి సపోర్ట్‌ ఇవ్వడంతో మెగా అభిమానులు మంచు మనోజ్‌ ఆటిట్యూడ్‌కి మరింత ఫిదా అయిపోయారు. మరోవైపు మంచు మనోజ్‌తో పాటు చాలా మంది యంగ్‌ హీరోలు, ఇండస్ట్రీ నుండి పలువురు సీనియర్‌ నటీనటులు కూడా ఈ పోరాటంలో పవన్‌కి మద్దతు పలుకుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS