చారి మళ్లీ వస్తున్నాడు. అదేనండీ భట్టాచారి. 'అదుర్స్' సినిమాలో బ్రహ్మనందం పాత్ర పేరు. ఇదే పాత్రలో మళ్లీ నవ్వులు పండించడానికి వస్తున్నాడు బ్రహ్మానందం. మంచు విష్ణు హీరోగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కృష్ణమాచారి తప్పులు అప్పలాచారి తిప్పలు అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ 'ఆచారి అమెరికా యాత్ర'. చాలా డిఫరెంట్‌గా ఉంది కదా. అలాగే సినిమా కూడా అంతే డిఫరెంట్‌గా ఉండబోతోందట. ఆధ్యంతం నవ్వుల పంటేనట. ఈ సినిమాలో మంచు విష్ణు ఓ చారి అయితే మరో చారి బ్రహ్మానందం. 'అదుర్స్' సినిమాలో ఎన్టీఆర్, బ్రహ్మానందం బ్రాహ్మణ గెటప్పుల్లో అదరగొట్టేశారు. అదే తరహాలో ఇప్పుడు మంచు విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్ తెర మీదికి రానుందన్నమాట. కామెడీ చిత్రాల్ని తెరకెక్కించడంలో జి. నాగేశ్వర్‌రెడ్డిది ఓ ప్రత్యేక శైలి. మంచు విష్ణు గతంలో 'దేనికైనా రెడీ' చిత్రంలో చారి గెటప్ వేసి నవ్వులు పండించారు. ఈ సారి మాత్రం ఓ డిఫరెంట్ స్టైల్లో అవే గెటప్పులతో అలరించడానికి మన ముందుకొచ్చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ లుక్ చూస్తుంటే 'అదుర్స్' సినిమానే గుర్తొస్తోంది. బట్ ఫర్ ఏ ఛేంజ్ ఈ సినిమాలో అప్పలాచారి, కృష్ణమాచారి ఇద్దరూ కలిసి అమెరికా యాత్ర చేసేస్తారట. అక్కడే అసలు కామెడీ అట. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనే చిత్రీకరించారట. ఈ సినిమా విష్ణు కెరీర్‌లో మంచి విజయాన్నివ్వాలని ఆశిద్దాం.