`మా` ఎన్నికలు సైడ్ ట్రాక్ పట్టాయి. విష్ణుమీదో, ప్రకాష్ రాజ్ మీదో ఫోకస్ అవ్వాల్సిన కళ్లు... ఇప్పుడు బండ్ల గణేష్ ని చూస్తున్నాయి. ఈ ఎలక్షన్లకే బండ్ల సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయిపోయారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చిన బండ్ల, జీవితపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.కేవలం జీవిత అంటే నచ్చకే.. తనపై పోటీకి దిగుతున్నానని ప్రకటించుకున్నాడు. జీవితకు వ్యతిరేకంగా, స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవి కోసం బండ్ల పోటీకి దిగుతున్నాడు.
అయితే బండ్లని తమ వైపుకు లాక్కోవాలని విష్ణు ప్యానల్ గట్టిగా ప్రయత్నిస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం కంటే, తమ ప్యానల్ లోకి వస్తే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, తమ మద్దతు అందిస్తామని ఊరిస్తున్నార్ట. జనరల్ సెక్రటరీ పోస్టే కాదు, ఇష్టమైన పదవికి పోటీ చేయొచ్చని బేరాలు మొదలెట్టారని తెలుస్తోంది. అయితే.... విష్ణు ప్యానల్ లో చేరడానికి బండ్లకి ఇష్టం లేదు. అలా చేస్తే.... మెగా కాంపౌండ్ కి వ్యతిరేకంగా పనిచేసినట్టే. కాబట్టి.. గణేష్ ఇప్పుడు ఆలోచనలో పడినట్టు టాక్.