విలన్ ని బకరా చేయడమనే కాన్సెప్ట్ కి రూపకల్పన చేసింది డైరెక్టర్ శ్రీను వైట్ల అనే చెప్పాలి.
తను రూపొందించిన ఈ కొత్త తరహా కథ,కథనం ఆడియన్స్ కి ఒక పెద్ద రిలీఫ్ లా దొరికింది. నిజం చెప్పాలంటే, ఇదే ఫార్ములా తో తరువాతి కాలంలో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి.
మంచు విష్ణు కెరీర్ కి ఇదొక పెద్ద బూస్ట్ ఇచ్చిన సినిమాగా చెప్పొచు. ఇక సినిమాలో బ్రాహ్మి చేసిన చారి క్యారెక్టర్ ఇప్పటికి హైలైట్ అని చెప్పొచు. వీరికి తోడుగా జయప్రకాశ్ రెడ్డి, సునీల్ పండించిన కామెడీ కూడా ప్రేక్షాకాదరణ పొందింది.
ఇక బకరా అయ్యే పాత్రలో రియల్ స్టార్ శ్రీహరి చేసిన శంకర్ పాత్ర ఈ సినిమాకి వెన్నుముక్కగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా విడుదల సమయానికి చాలా ఇబ్బందులకి గురయినప్పటికి శ్రీను వైట్ల మాత్రం పట్టు వదలకుండా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి తన కెరీర్ లోనే ఒక మరుపురాని చిత్రంగా దీని మలుచుకున్నాడు.
నిన్నటితో ఈ సినిమా రిలీజ్ అయి 10 సంవత్సారాలు గడిచింది. సినిమా పరంగా చుస్తే, ఇదొక ట్రెండ్ సెట్టర్ అని కచ్చితంగా చెప్పొచ్చు.