మంచు వారింట శ్రావణ లక్ష్మి ఆగమనం.!

మరిన్ని వార్తలు

శ్రావణ శుక్రవారం నాడు మంచు వారింట లక్ష్మీ కళ వెల్లివెరిసింది. మంచు విష్ణు భార్య విరానికా ఆడపిల్లకు జన్మనిచ్చింది. శ్రావణ శుక్రవారం నాడు ఆడపిల్ల జన్మించిందంటే, లక్ష్మీ దేవి ఇంట్లో అడుగు పెట్టినట్లే అని భావిస్తుంటారు. ఆయన అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఇదే ప్రస్థావిస్తూ, 'లక్ష్మీదేవి పుట్టింది. ఇక మీకు అన్నీ శుభాలే..' అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సినీ ప్రముఖులు కూడా సోషల్‌ మీడియాలో మంచు విష్ణుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇప్పటికే మంచు విష్ణు, విరానికా దంపతులకు ముగ్గురు సంతానం ఉన్న సంగతి తెలిసిందే. తొలి సంతానంగా అరియానా, వివియానా అనే కవలలకు జన్మనిచ్చింది విరానికా. రెండో సంతానంగా మగ బిడ్డ అవ్రామ్‌ జన్మించాడు. ఇప్పుడు మూడో సంతానంలో మళ్లీ అమ్మాయి జన్మించింది. ఇక సినిమాల పరంగా, మంచు విష్ణు కెరీర్‌ కాస్త స్లోగానే నడుస్తోంది. ఇటీవల 'ఓటర్‌' సినిమాతో మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. చూడాలి మరి, ఇకపై అయినా, మంచు విష్ణు కెరీర్‌ గాడిన పడుతుందేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS