మ‌రోసారి ఢీ కొట్ట‌డానికి సిద్ధం

By Gowthami - November 20, 2020 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

2007లో విడుద‌లైన `ఢీ` మంచి విజ‌యాన్ని సాధించింది. ఓ కొత్త ఫార్ములాని తెలుగు చిత్ర‌సీమ‌కు అందించింది. విల‌న్ ఇంట్లో హీరో దూరి, బ‌క‌రాని చేసే ఫార్ములా ఢీ సినిమాతో ఊపందుకుంది. ఈ దారిలో చాలా సినిమాలు వ‌చ్చాయి. ఆడాయి. శ్రీ‌నువైట్ల ఈ సినిమాతోనే అగ్ర హీరోల దృష్టిలో ప‌డ్డాడు. చాలా కాలంగా ఢీ 2 వ‌స్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడు అందుకు ముహూర్తం ఖ‌రారైంది.

 

మంచు విష్ణు హీరోగా, శ్రీ‌నువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఈ సోమ‌వారం ఈ చిత్రానికి సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. ఢీ కాంబోలో వ‌స్తోంది కాబ‌ట్టి.. ఢీ 2 అనే పేరే ఫైన‌ల్ చేసే అవ‌కాశాలున్నాయి. శ్రీ‌నువైట్ల గ‌త సినిమాల్లానే ఎంట‌ర్‌టైన్‌మెంట్ కి అధిక ప్రాధాన్య‌త ఇస్తూ.. ఓ వెరైటీ కాన్సెప్టుతో ఈ క‌థ‌ని రెడీ చేశార్ట‌. ఢీలో శ్రీ‌హ‌రి పాత్ర చాలా హైలెట్ అయ్యింది. అలానే ఈ క‌థ‌లోనూ ఓ హీరోకి కీల‌క‌మైన పాత్ర ద‌క్క‌బోతోంద‌ని స‌మాచారం. మ‌రిన్ని వివ‌రాలు తెలియాలంటే సోమ‌వారం వ‌ర‌కూ ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS