ఆదిపురుష్‌కి ఇది సాధ్య‌మేనా?

By Gowthami - November 20, 2020 - 15:02 PM IST

మరిన్ని వార్తలు

దాదాపు 450 కోట్ల‌తో రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్‌. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఓం రౌత్ ద‌ర్శ‌కుడు. ఈమ‌ధ్యే ఆదిపురుష్ `రిలీజ్ డేట్‌` బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రాన్ని 2022 ఆగ‌స్టు 11న ఈ సినిమాని విడుద‌ల చేస్తార‌ని చిత్ర‌బృందం తెలిపింది. ఓ సినిమా ప్రారంభం కాకుండానే రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌డం గొప్ప విష‌య‌మే. కాక‌పోతే.. `ఆది పురుష్‌` విష‌యంలో చెప్పిన స‌మ‌యానికి సినిమా రావ‌డం అంత తేలికైన సంగ‌తి కాదు. ఎందుకంటే... ఆదిపురుష్ ఓ భారీ చిత్రం. విఎఫ్ఎక్స్‌కి చాలా ప్రాధాన్యం ఉంది.

 

ఇలాంటి సినిమాలు ఎప్పుడు పూర్త‌వుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితి. పైగా 2022 ఆగ‌స్టు 11 అంటే.. ఇంకా రెండేళ్లు ఉంది. అప్ప‌టికి రాజెవ‌రో, మంత్రెవ‌రో..? క‌నీసం షూటింగ్ ఎప్పుడు మొద‌లెడ‌తారో, ఆ డేట్ చెప్పుంటే బాగుండేది. రిలీజ్ డేట్ ముందే చెప్ప‌డం వ‌ల్ల‌, మిగిలిన సినిమాలు, షెడ్యూళ్ల విష‌యంలో ఓ క్లారిటీ వ‌స్తుంది. కాక‌పోతే.. ఓ టార్గెట్ పెట్టుకుని ప‌ని చేయ‌డం ఎప్పుడూ ఒత్తిడికి గురి చేసే విష‌య‌మే. ఈ విష‌యంలో `ఆది పురుష్‌` తొంద‌ర ప‌డ్డాడేమో అనిపిస్తోంది


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS