ఈ ఫోటోలో అందాలారబోస్తూ, నవ్వులు చిందిస్తున్న బ్యూటీ పేరుకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌ని ఒకప్పుడు తన అంద చందాలతో షేక్ చేసేసింది. ఐటెం సాంగ్స్‌తో కుర్రకారును పిచ్చెక్కించేసింది. ఇప్పుడు ఆమె వయసు 45 ఏళ్లు. పేరు మందిరా బేడి. గ్లామర్‌కి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తోంది. తాజాగా బికినీ ఫోటోలతో కిర్రాకు పుట్టిస్తోంది. ఈ మధ్య హాలీడే వెకేషన్ నిమిత్తం విదేశాల్లో ఈ ఏజ్డ్ బ్యూటీ తెగ ఎంజాయ్ చేస్తోంది. దానికి సంబంధించి, హాట్ హాట్ పిక్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇలా మురిసిపోతోంది. ఇంత వయసులోనూ తనలోని గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. కావాలంటే చూసుకోండి అన్నట్లుగా ఉన్నాయి ఆ ఫోటోలు. ఇకపోతే, అప్పట్లో సౌత్‌లో శింబు హీరోగా వచ్చిన 'మన్మధ' సినిమాలో నటించిన మందిరా బేడీ, తాజాగా తెలుగులో ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'సాహో'లో నటిస్తోందని సమాచారమ్.