నూతన సంవత్సర సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రంక్ & డ్రైవ్ లో దొరికిపోయిన యాంకర్ ప్రదీప్ కారుని సీజ్ చేయడం ఆ తరువాత ఆయన పై ట్రాఫిక్ ఉల్లంగనల కేసుని కూడా పెట్టారు.
అయితే మంగళవారం నుండి మొదలైన కౌన్సిలింగ్ కి ప్రదీప్ హజరుకాకపోవడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఇక ఆయన రాకపోవడంతో ఆయన ఇంటికి వెళ్ళి నోటిసులు అందచేద్దాము అన్న పోలిసులకి తాళం వేసిన ఆయన ఇల్లు దర్శనమిచ్చింది. అలాగే కూకట్ పల్లి లోని ఆయన కార్యాలయంలో కూడా ఆయన జాడ కనిపించలేదు.
దీనితో ఆయన ఈరోజు కూడా కౌన్సిలింగ్ కి రాకపోతే ఇక ఈ కేసుని లా & ఆర్డర్ పోలీసులకి అందచేస్తారు. ఇదే గనుక జరిగితే ఆయన పై మరో కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడు ప్రదీప్ విషయం విన్న వారంతా ఆయనని ‘అజ్ఞాతవాసి’ అని అంటున్నారు.
ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ అవ్వడంతో ఈ టైటిల్ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది.