ఈ బాక్సింగ్ బ్యూటీని చూశారా.? బాక్సింగ్ బ్యూటీ అంటే రితికా సింగ్ అనుకునేరు. అక్కడున్నది నాలుగు పదుల వయసులో ఉన్న ఆంటీ. కానీ, వయసుకీ, ఫిట్నెస్కీ సంబంధం లేదని ఎప్పటికప్పుడే నిరూపిస్తుండే ఈ ఆంటీ మరెవరో కాదు, బాలీవుడ్ హాట్ సంచలనం మందిరా బేడీ. మగవాళ్లకు ధీటుగా సిక్స్ ప్యాక్ బాడీని చూపించేస్తోంది. ఇదంతా ఎందుకో తెలుసా.? 'సాహో' సినిమా కోసమేనట. ఈమె ప్రస్తుతం 'సాహో' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మందిరాబేడీ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. ఆ సంగతి పక్కన పెడితే, ఎప్పుడూ ఫిట్ బాడీతో, హాట్ హాట్ పిక్స్ పోస్ట్ చేసే మందిరా బేడీ, తాజాగా పోస్ట్ చేసిన ఈ పిక్కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ సినిమాలో మందిరా బేడీ పాత్రకు సంబంధించి అఫీషియల్‌గా ఎలాంటి హింట్స్ రాలేదు కానీ, మందిరా ఇచ్చిన ఈ హింట్‌ని బట్టి అర్ధమవుతోంది. ఆమె పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉండబోతోందో. ఇక ఫోటో విషయానికొస్తే, బాక్సింగ్ పోజులో ఆ పర్ఫెక్షన్ చూస్తే, ప్రొఫిషనల్ బాక్సర్‌లాగా లేదూ. కాదని కూడా చెప్పలేమనుకోండి. ఇక నాభిపై ఉన్న ఆ టాటూ సింప్లీ సూపర్బ్.