బాలీవుడ్ నటి మందిరా బేడీ తెలుగులో ‘సాహో’ సినిమాలో నటించిన విషయం విదితమే. అయితే, ఆమె పాత్రకు తెలుగునాట పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక, పబ్లిసిటీ స్టంట్స్ చేయడంలో మందిరా బేడీ దిట్ట. సుదీర్ఘ కాలంగా బీభత్సమైన ఎక్స్‌పోజింగ్‌తో ‘హాట్ అండ్ సెక్సీ ఆంటీ’గా రకరకాల పోజులతో కుర్రకారుని హీటెక్కించేస్తోన్న ఈ బ్యూటీ, తాజాగా ఓ ఈవెంట్‌లో సందడి చేసింది.. హాట్ హాట్‌గా. ఇంతకీ, ఈ ఈవెంట్‌లో ప్రత్యేకత ఆమె వేసుకున్న డ్రెస్. నిజానికి, అదేమంత ప్రత్యేకమైనది కాదు. పరమ రొటీన్ వ్యవహారమే. అయితే, ఆ డ్రెస్ ధర చెప్పి అందర్నీ షాక్‌కి గురిచేసింది మందిరా బేడీ.
ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేయడం బహుశా ఆమెకే చెల్లుతుందేమో. స్ట్రీట్ వెండర్స్ దగ్గర కొనుగోలు చేసిన ఆ డ్రెస్ ధర 700 రూపాయలు కూడా కాదట. ఆ డ్రెస్‌ని థాయిలాండ్‌లో కొనుగోలు చేశానని మందిరా బేడీ చెప్పుకొచ్చింది. అంతే, మందిరా బేడీ పేరు.. ఆమె వేసుకున్న డ్రెస్ ఇప్పుడు పాపులర్ అయిపోయింది. చక్కనమ్మ ఏం చెప్పినా అది వింతే.. అన్నది వెనకటి మాట. సెక్స్ బాంబ్ ఏం చెప్పినా.. అది సంచలనమే అన్నది ఇప్పటి మాట. అవును మరి, లేకపోతే.. ఏమాత్రం ప్రత్యేకతలేని ఆ డ్రస్ గురించి అంత ప్రత్యేకంగా చెప్పి, పాపులారిటీ పొందడం ఆశ్చర్యకరమే కదా. మామూలుగా అయితే అందాల భామలు తాము వేసుకున్న డ్రెస్ ధరల్ని లక్షల్లో చెబుతుంటారు. అందుకు భిన్నంగా మందిరా బేడీ వందల్లో రేటు చెప్పింది. ఇంకా నయ్యం.. పది రూపాయలో, పాతిక రూపాయలో అని చెప్పలేదు.!