గత కొన్ని రోజులుగా 'సాహో' సినిమా నుండి కీలక పాత్రధారుల్ని పరిచయం చేస్తూ వరుసగా పోస్టర్లు వదులుతున్నారు. అందులో భాగంగా తాజాగా మందిరా బేడీ పోస్టర్ వదిలారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ మందిరా బేడీ విలన్స్ గ్యాంగ్‌లో ఓ కీలక పాత్ర పోషించనుంది. ఆమె పేరు 'కల్కి' అంటూ, పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌పై 'గుడ్ ఈజ్ బ్యాడ్' అనే క్యాప్షన్ రాసుంది. ఫుల్ స్లీవ్ బ్లాక్ బ్లౌజు, బ్లాక్ శారీలో, మెడలో పొడుగాటి మెటల్ హారం ధరించి, షార్ట్ హెయిర్ స్టైల్‌లో పవర్ ఫుల్ లేడీ విలన్‌గా కనిపిస్తోంది మందిరా బేడీ లుక్.
ఈ సినిమాలో మందిరా బేడీ కొన్ని యాక్షన్ సీన్స్‌లో కూడా నటించిందని సమాచారం ఉంది. నాలుగు పదుల వయసులోనూ ఫిట్‌గా బాడీని మెయింటైన్ చేసే మందిరా బేడీకి దాదాపు 20 ఏళ్ల నటనానుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఈ సినిమాలో ఆమెకు ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారనీ తెలుస్తోంది. తెలుగులో మందిరా నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిది. 'సాహో' వంటి భారీ యాక్షన్ సినిమాతో మందిరా బేడీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.
ఖచ్చితంగా ఆమె పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుందట. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నుండి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తోంది. శ్రద్ధాకపూర్, ప్రబాస్‌కి జోడీగా నటిస్తోంది. ఆగస్ట్ 30న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది 'సాహో'.