బాలీవుడ్ హాట్ సెన్సేషన్.. వయసు నాలుగు పదులు. కానీ, బికినీ వేస్తే స్వీట్ సిక్స్టీన్స్ కూడా కుళ్లుకుంటారు. ఇంతకీ ఎవరా ఏజ్డ్ హాట్ సెన్సేషన్ అంటే.. ఇంకెవరు మందిరా బేడి. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ పిక్ పోస్ట్ చేసింది. మైకం కమ్మేలా ఉంది. ఎప్పటికప్పుడే మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేసే మందిరా బేడీ తాజా వెకేషన్లో భాగంగా, తనకిష్టమైన రిసార్ట్‌లో స్టే చేసింది. ఆ క్రమంలోనే స్విమ్మింగ్ పూల్‌లో చేయించుకున్న ఓ స్పెషల్ ఫోటో షూట్ పిక్స్‌ని ఫ్యాన్స్ కోసం నెట్టింట్లో షేర్ చేసింది. రెడ్ అండ్ బ్లూ బ్రైట్ కాంబినేషన్లో ధరించిన టూ పీస్ బికినీ అది. నేలపై పడుకుని ఉంది. లాంగ్ వ్యూ.
ఓ పక్క నేలను తాకేలా కనిపిస్తున్న నీలి మేఘాల నింగి. నేలపై పరిచిన మందిరా పరువాలు.. ఒకదానికొకటి డామినేట్ చేసేలా కనిపిస్తున్నాయి. నిజానికి ఈ వ్యూ చూస్తూంటే, స్విమ్మింగ్ పూల్ వ్యూలా లేదు. బీచ్ వ్యూని తలపిస్తోంది. ఈ వ్యూలో మందిరా అందాలు సింప్లీ సూపర్బ్. అందుకే ఈ పిక్కి నెట్టంట్లో వస్తున్న కామెంట్లు అద్భుతం, అమోఘం. ఈ వయసులోనూ మందిరా వంపు సొంపులు అత్యద్భుతం. ఇటీవల 'సాహో' సినిమాలో మందిరా బేడీ నటించిన సంగతి తెలిసిందే.