రామ్‌చరణ్‌ 'ఆమె'కు ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జోరు మీదున్న వేళ ఆయనతో జోడీ కట్టే ముద్దుగుమ్మల కోసం వేట కొనసాగుతోంది. తొలి సినిమాకి చందమామ కాజల్‌ అగర్వాల్‌ని వరించిన ఆ గోల్డెన్‌ ఛాన్స్‌, రెండో సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాకి దక్కింది. ఇక ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి రీ ఎంట్రీలో ముచ్చటగా మూడో సినిమాకి సిద్ధమవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కమర్షియల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్‌ ఇంకా సెట్‌ కాలేదు.

 

ఆల్రెడీ సీనియర్‌ భామలైన తమన్నా, కాజల్‌కి చిరుతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ ఛాన్స్‌ దక్కేసింది. ఈ ఇద్దరూ చరణ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నవాళ్లే. ఇక ఇప్పుడు మరో భామ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదు. అందాల భామ శృతిహాసన్‌. శృతిహాసన్‌ మెగా కాంపౌండ్‌లో ఇప్పటికే రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, పవన్‌ కళ్యాణ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. సూపర్‌ డూపర్‌ హిట్స్‌ తన ఖాతాలో వేసుకుంది. మెగా కాంపౌండ్‌కి శృతిహాసన్‌ బాగా కలిసొచ్చిన హీరోయిన్‌ అని చెప్పక తప్పదు.

 

సో లేటెస్ట్‌ సమాచారం ప్రకారం శృతిహాసన్‌కి మెగా ఛాన్స్‌ దక్కబోతుందనే టాక్‌ సరికొత్తగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకి నిర్మాత చరణ్‌ కావడంతో, చరణ్‌ అనుకుంటే శృతికి ఈ ఛాన్స్‌ అసాధ్యమేమీ కాదు. ఏమో చరణ్‌, అల్లు అర్జున్‌, పవన్‌ కళ్యాణ్‌.. ఇలా వీరితో తనకున్న స్నేహంతో ఏకంగా మెగాస్టార్‌తోనే ఛాన్స్‌ కొట్టేస్తుందేమో చూడాలిక. అన్నట్లు కొరటాల శివకు కూడా శృతి కలిసొచ్చిన హీరోయినే. కొరటాల తెరకెక్కించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'శ్రీమంతుడు'లో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS