పూరీ జగన్నాధ్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రొమాంటిక్'. ఈ సినిమాని వీలైనంత త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూరీ తనయుడు ఆకాష్ పూరీ ఈ సినిమాకి హీరో కాగా, కొత్త భామ కేతికా శర్మ హీరోయిన్గా పరిచయమవుతోంది. ఈ సినిమాలో శివగామి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రమ్యకృష్ణ పాత్రకు మొదట్లో బాలీవుడ్ గ్లామర్ సెన్సేషన్ మందిరా బేడీని తీసుకున్నారట. ఆమెతో కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారట. కానీ, ఎందుకో మందిరా బేడీ అప్పీల్ సినిమాకి సెట్ కాలేదని చిత్ర యూనిట్ భావించిందట. దాంతో ఆమె ప్లేస్‌లోకి రమ్యకృష్ణని తీసుకొచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ మందిరా బేడీ నటించి ఉంటే, సినిమాకి ఎక్స్ట్రా క్రేజ్ యాడ్ అయ్యేదేమో అంటున్నారు కొందరు.
మందిరా బేడీ ఇటీవల 'సాహో' సినిమాలో ఓ ఇంపార్టెంట్లో రోల్లో కనిపించింది. కానీ, సినిమా ఆశించిన రిజల్ట్ అందుకోకపోవడంతో, ఈ సినిమాలో నటించిన హేమా హేమీ నటులకే పాపులారిటీ దక్కలేదు. వారితో పాటు, గుంపులో గోవిందలా మందిరా బేడీ క్యారెక్టర్ కూడా మిస్ యూజ్ అయిపోయింది. తెలుగులో మొదటి సినిమా అలా అవడం, రెండో సినిమా 'రొమాంటిక్' ఇలా అవ్వడం ఈ బాలీవుడ్ బ్యూటీకి ఎందుకో టాలీవుడ్ అంతగా కలిసి రాలేదు కాబోలు.