'ఏడు చేపల కథ'.. ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై పెద్దగా అంచనాల్లేవ్ కానీ, అడల్ట్ కంటెంట్ కావడంతో తొలి రోజు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. అందులోనూ సోలో రిలీజ్ కావడంతో టాక్‌తో సంబంధం లేకుండా ధియేటర్స్‌కి జనం బాగా ఎట్రాక్ట్ అయ్యారు. అన్నింటికీ మించి, ఓ వర్గం ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఆదరించారు. యూత్, మాస్ ఆడియన్స్ సహజంగానే ఈ తరహా కంటెంట్ మూవీస్‌ని ఆదరిస్తుంటారు. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే, స్కూలుకెళ్లే పిల్లలు ఈ సినిమా ధియేటర్స్‌కి క్యూ కట్టడం. స్కూల్ బ్యాగులతో ధియేటర్స్‌కి పోటెత్తిన వైనం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
స్కూల్ పిల్లల్ని అడల్ట్ కంటెంట్ సినిమాకి ఎలా అనుమతించారంటూ ఈ అంశంపై నెట్టింట్లో రచ్చ జరుగుతోంది. ఎంత డబ్బులు కోసం అయితే మాత్రం మరీ ఇంతలా గడ్డి కరుస్తారా.? అంటూ సదరు ధియేటర్ యజమానులపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. కంబైండ్ స్టడీస్ పేరుతో ధియేటర్‌లో హల్‌చల్ చేస్తున్న స్టూడెంట్స్, కాదు కాదు, స్కూల్ పిల్లల తీరును తప్పుపడుతున్నారు. పలు టీవీ ఛానెల్స్‌లో, యూట్యూబ్ ఛానెల్స్‌లో ఈ సినిమా ప్రమోషన్సే వారిపై అలాంటి ప్రేరణకు దారి తీశాయా.? అనేది అర్ధం కావడం లేదు జనానికి.