'మణికర్ణిక' సస్పెన్స్‌కి చెక్‌ పడేదెప్పుడంటే..!

మరిన్ని వార్తలు

కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'మణికర్ణిక'. ఈ సినిమా టీజర్‌ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. టీజర్‌ రిలీజ్‌ని అనౌన్స్‌ చేస్తూ మణికర్ణికగా కంగనా రనౌత్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.

 

బ్యాక్‌ గ్రౌండ్లఓ వినాయకుని నిండైన మూర్తి, ముందు ట్రెడిషనల్‌ లుక్‌లో కంగనా రనౌత్‌ ఉన్న ఈ స్టిల్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. వీరనారి రాణీ ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ మొదలైన నాటి నుండీ పలు వివాదాల్ని ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో కీలక పాత్రధారి అయిన సోనూసూద్‌ సినిమా సగంలో ఉండగానే బయటికి తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

 

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దర్శకత్వం నుండి క్రిష్‌ కూడా తప్పుకున్నాడన్న ప్రచారం కూడా ఉంది. కంగనా రనౌత్‌ మొత్తం బాధ్యత తనమీదే వేసుకుని దర్శకత్వంలో కూడా వేలు పెట్టి కెలుకుతోందనే రూమర్స్‌ మరోవైపు ఉన్నాయి. అయితే అసలేం జరిగుతోంది. దర్శకుడిగా క్రిష్‌ పేరు ప్రకటిస్తారా? లేక కంగనా పేరు వేస్తారా? అనే సస్పెన్స్‌కి తెరపడాలంటే, అక్టోబర్‌ 2 వరకూ వెయిట్‌ చేయాల్సిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS