మార్పు మంచిదే అంటోన్న ముద్దుగుమ్మ.!

By iQlikMovies - September 29, 2018 - 13:49 PM IST

మరిన్ని వార్తలు

'మరక మంచిదే..' మాదిరిగా మార్పు కూడా మంచిదే అంటోంది అందాల భామ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా గడపడమే కాకుండా, రకుల్‌ ఉంటే ఆ సినిమా సూపర్‌ హిట్టే అనే లెక్కల్లో ఉండేవారు. టాలీవుడ్‌ని అలా ఏక చత్రాధిపత్యాన ఏలేసింది ఈ మకుటం లేని మహారాణి. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఒక్కసారి వచ్చిన కుదుపు సెట్‌ అవ్వడానికి చాలానే టైం పడుతుంది.

 

రకుల్‌కి మరింత ఎక్కువ టైం తీసుకుంది. కెరీర్‌ జోష్‌ మీదున్న టైంలో పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా వరుస సినిమాల్లో నటించింది. నాగచైతన్యతో 'రారండోయ్‌ వేడుక చూద్దాం..' సినిమా తర్వాత బాలీవుడ్‌లో అడుగు పెట్టిన రకుల్‌కి తెలుగులో అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. మెల్ల మెల్లగా రకుల్‌ హవా పూర్తిగా తగ్గిపోయింది తెలుగులో. తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

 

బాలీవుడ్‌లో తొలి సినిమా నిరాశపరిచింది. కానీ వెంటనే మరో అవకాశం రకుల్‌ని ఆదుకుంది. అజయ్‌ దేవగణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ప్రస్తుతం. అలాగే తమిళంలో కార్తీ, సూర్యల సరసన నటిస్తోంది. త్వరలో తెలుగులోనూ తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతోంది. ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎన్టీఆర్‌'లో రకుల్‌ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌తో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇలా తన కెరీర్‌లో చోటు చేసుకున్న మార్పుల్ని స్పోర్టివ్‌గా తీసుకుంటూ, మళ్లీ సత్తా చాటేందుకు సరికొత్తగా సిద్ధమవుతోంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS