'మణికర్ణిక'తో ఆడేసుకుంటున్నారోచ్‌

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనారనౌత్‌ నటించిన 'మణికర్ణిక' చిత్రం ట్రైలర్‌ ఇటీవల బయటికొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్‌ బయటికొచ్చినప్పటి నుండీ సోషల్‌ మీడియాలో కంగనా రనౌత్‌పై వెటకారాలు ఓ రేంజ్‌లో మొదలయ్యాయి. ట్రైలర్‌ బాగానే వున్నా, అందులో కంగన ఎక్స్‌ప్రెషన్స్‌ చాలా చిరాగ్గా వున్నాయి.. అంటూ నెటిజన్లు ట్రాలింగ్‌ మొదలెట్టారు. 

వాస్తవానికి కంగనా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది పలు సినిమాలతో. కానీ ఎందుకో 'మణికర్ణిక'లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ కుదరలేదు. ట్రైలర్‌లో వచ్చిన కొన్ని స్టిల్స్‌ని ట్రాల్‌ చేస్తూ కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, ఈ సినిమా విషయంలో కంగనా చాలా చాలా ఓవరాక్షన్‌ చేసిందంటూ పలు వార్తలు ప్రచారంలో ఉన్న మాట వాస్తవమే. ముఖ్యంగా క్రిష్‌ని దర్శకత్వం నుండి తప్పించి, తానే మొత్తం సినిమా వ్యవహారాల్ని చూసుకోవడం కూడా ఆమెపై విమర్శలకు కారణం. 

క్రిష్‌ లాంటి విజన్‌ వున్న దర్శకుడి నేతృత్వంలో ట్రైలర్‌ వచ్చి వుంటే, అది నెక్స్‌ట్‌ లెవల్‌లో వుండేది. కానీ 'మణికర్ణిక' విషయంలో అలా జరగలేదు. అఫీషియల్‌గా దర్శకత్వం విభాగంలో పేరుకు క్రిష్‌ పేరు మెన్షన్‌ చేసినప్పటికీ, అందులో కంగనా హస్తం కూడా లేకపోలేదు. 

ఇక ట్రైలర్‌ విషయంలోనే ఇన్ని విమర్శలు వస్తే, సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS