డైరెక్టర్ చేతిలో మోసపోయిన హీరోయిన్

మరిన్ని వార్తలు

తెలుగులో వచ్చిన తూనీగా తూనీగా చిత్రం హీరోయిన్ అయిన మనీషా యాదవ్ తమిళ డైరెక్టర్ పైన సంచలన వ్యాఖ్యలు చేసింది.

వివరాల్లోకి వెళితే, మనిషా యాదవ్ తమిళంలో చేసిన చెన్నై 600028-2 చిత్రంలో పాత్రకి తీవ్ర విమర్శలు ఎదురుకుంది. కారణం- ఆ పాత్రని చాలా చీప్ గా ఉండటమే కాకుండా పలు డబల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉండటం వల్ల ఆ పాత్ర పైన చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే తనకి ఆ పాత్ర గురించి వివరించినప్పుడు దర్శకుడు వెంకట్ ప్రభు వేరేలా చెప్పడని కాని సినిమా పూర్తయ్యాక అసలు పాత్ర తీరే మారిపోయింది అని తెలిపింది.

ఆ పాత్ర చేయడం వల్ల తన కెరీర్ కి చాలా పెద్ద దెబ్బ అని దీనంతటికి కారణం దర్శకుడు వెంకట్ ప్రభు అని చెప్పింది. ఇది ఒక రకంగా తనని మోసం చెయ్యడమే అని చెప్పి ఇక పై తను చేసే చిత్రాల పాత్రాలని పూర్తిగా తెలుసుకున్నాకే సినిమా చెయ్యడానికి అంగీకరిస్తాను అని చెప్పుకొచ్చింది. 

ఏదేమైనా... మనీషా యాదవ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS