చిరంజీవి - మణిశర్మలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి నుంచి వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్ హిట్టే. ఇప్పుడు కొరటాల శివ కోసం మణిశర్మని స్వరకర్తగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈలోగా మణిశర్మ తన పని మొదలెట్టేశారు కూడా. బ్యాంకాక్‌లో ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్ లో ఉన్నారు. చిరు కోసం ట్యూన్లు సిద్ధం చేస్తున్నారు.
మణిశర్మతో పాటు కొరటాల శివ కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఓ వారంలో వీరిద్దరూ తిరిగి ఇండియాకి వచ్చేస్తారు. వచ్చాక చిరు 152వ సినిమా షూటింగ్ మొదలైపోతుంది. ఈ చిత్రంలో కథానాయికగా త్రిష నటించే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు.. తను ఓ పాత్ర లో కూడా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.