గ్లామ్‌షాట్‌: హై ఓల్టేజ్‌ 'మంజరీ' హాట్‌నెస్‌!

మరిన్ని వార్తలు

మంజరీ ఫడ్నేస్‌.. ఈ పేరుకు పెద్దగా పాపులారిటీ లేదు. కానీ, పాప మాత్రం సుపరిచితురాలే. అల్లరి నరేష్‌తో 'సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం' సినిమాతో తెరంగేట్రం చేసింది. అంతకు ముందే కొన్ని హిందీ, బెంగాలీ సినిమాల్లో నటించిన అనుభవం ఉంది ఈ ముద్దుగుమ్మకి. అందాల రాశి. ఆరబోతకూ వెనుకాడదు. అయితే, తెలుగులో అంతగా గుర్తింపు దక్కిన పాత్రలు పోషించలేకపోయింది. జూనియర్‌ ఎన్టీఆర్‌తో 'శక్తి' సినిమాలో ఫ్లాష్‌ బ్యాక్‌లో ఓ సీన్‌లో కనిపించింది. గ్లామర్‌లో హద్దుల్లేకపోయినా, హద్దులు మీరి గ్లామర్‌ ఒలకబోసే అవకాశం కూడా పెద్దగా చిక్కలేదు అమ్మడికి.

 

దాంతో ఏ రకంగానూ రేస్‌లో నిలవలేకపోయింది. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా నెట్టింట్లో మంజరీ ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. హాట్‌నెస్‌ కా బాప్‌ అనేలా ఉందీ పిక్‌. బ్లాక్‌ కలర్‌ డిజైనర్‌ బ్రా ధరించి ఓ రకమైన సెక్సీ పోజిచ్చింది. ఈ పోజులో పాప హాట్‌ హాట్‌ అందాలు కుర్రకారును గిలిగింతలు పెట్టించేస్తున్నాయి. కనిపించాల్సినంత కనిపస్తూ కవ్విస్తున్న క్లీవేజ్‌తో పాటు, కవుల వర్ణనకు కరెక్ట్‌గా అతికిపోయేలా ఉన్న ఆ నాభిసౌందర్యం పిచ్చెక్కించేస్తోంది. ఈ పిక్‌ చూసి, 'ఓరి బ్రహ్మదేవుడో.. ఇంతందాన్ని ఏడ దాచినావురో..' అంటూ పాటేసుకోకుండా ఉండలేకపోతున్నారు క్రేజీ యూత్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS