రాహుల్‌కి పునర్నవి హెల్ప్‌ చేస్తుందా? లేదా?

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో ఈ సీజన్‌కి సంబంధించి రాహుల్‌, పునర్నవి, వరుణ్‌, వితికలు మంచి స్నేహితులు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్‌బాస్‌ చూస్తున్న ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయితే, ఈ నలుగురిలో ఎవరు హౌస్‌ నుండి బయటికి వెళ్లినా, మిగిలిన వాళ్లకు హెల్ప్‌ చేయాలని ముందుగానే అనుకున్నారట. మరి ఈ వారం హౌస్‌ నుండి బయటికి వచ్చేసిన పునర్నవి ఆ పనిలో ఉందా? అంటే అవుననే అంటున్నారు నెట్టింటి జనులు. రాహుల్‌ని ప్రత్యేకంగా బెస్టెస్ట్‌ ఫ్రెండ్‌గా అభివర్ణించింది పునర్నవి.

 

ఈ వారం రాహుల్‌తో పాటు, తన మరో బెస్ట్‌ ఫ్రెండ్‌, హౌస్‌లో బ్రదర్‌ అయిన వరుణ్‌ కూడా నామినేషన్స్‌లో ఉన్నాడు. సో వీరిద్దరినీ సేవ్‌ చేసేందుకు పునర్నవి బయటి నుండి గట్టిగానే కసరత్తులు చేస్తోందట. ముఖ్యంగా రాహుల్‌ని సేవ్‌ చేయడానికి పునర్నవి బిగ్‌ స్కెచ్‌ ప్రిపేర్‌ చేసిందని తెలుస్తోంది. సో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న రాహుల్‌, వరుణ్‌, మహేష్‌లలో పునర్నవి కారణంగా వరుణ్‌, రాహుల్‌ ఖచ్చితంగా సేవ్‌ అవుతారనీ, ఎడ్జ్‌ ఉన్నది మహేష్‌కే అని తెలుస్తోంది. గత వారమే మహేష్‌ ఎలిమినేట్‌ కావాల్సి ఉంది.

 

కానీ, ఎలాగోలా తప్పించుకున్నాడు. కానీ ఈ సారి మహేష్‌పై వేటు పడక తప్పదేమో. ఇదిలా ఉంటే, హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆలీ తన కోసం ప్రత్యేకమైన టీమ్‌ని సిద్ధం చేసుకున్నాడట. నిజానికి తొలిసారి నామినేషన్‌కే ఎలిమినేట్‌ అయిపోయాడు ఆలీ. దాంతో ఈ సారి పక్కా స్ట్రాంగ్‌ టీమ్‌ని సిద్ధం చేసుకుని రీ ఎంట్రీ ఇచ్చాడట. తన కోసమే కాదట. తనకు హౌస్‌లో అత్యంత సన్నిహితురాలైన శివజ్యోతి కోసం కూడా ఎక్స్‌ట్రా టీమ్‌ని అలీ సిద్ధం చేశాడనీ ప్రచారం జరుగుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS