సూపర్ కృష్ణ కుమారై, మహేష్ సోదరి అయిన మంజుల పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆమెకు సూపర్ స్టార్ మహేష్‌బాబు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ అందించారు. కాగా నటిగా మంజుల తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. 'కావ్యాస్ డైరీ',ఆరెంజ్' తదితర చిత్రాల్లో నటిగా నటించింది మంజుల. కానీ తర్వాత నటిగా కొనసాగలేకపోయింది. దాంతో నిర్మాణంపై దృష్టి పె. 'పోకిరి', నాని', ఏ మాయ చేశావె' తదితర చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. నటిగా, నిర్మాతగా చేసినా కానీ అవేమీ తనకు సంతృప్తినివ్వలేదట. ఆ విషయాన్నే మంజుల అభిమానులతో పంచుకుంటూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. తాజాగా మంజుల ఓ షార్ట్ ఫిలిం నిర్మిస్తోంది. 'మనసుకు నచ్చింది' అనే ఈ షార్ట్ ఫిలిం ద్వారా తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలిపనుంది మంజుల. త్వరలోనే ఈ షార్ట్ ఫిలిం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె మొదట తనను తాను పరిచయం చేసుకుంటూ, తన జీవితంలో ఎదురైన సమస్యలు, నటిగా ఎందుకు ఎదగలేకపోయిందో, అందుకు ఆమె తెలుసుకున్న నిజాలు తదితర విషయాలను అభిమానులతో పంచుకుంది. దాంతో పాటు 'మనసుకు నచ్చింది', 'ఫాలో యువర్ హార్ట్' అనే హ్యాష్ ట్యాగ్స్ జత చేస్తూ ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఇన్ని సినిమాల్లో నటిగా నటించినా, నిర్మాతగా పని చేసినా ఇవ్వని తృప్తి ఈ షార్ట్ ఫిలిం ద్వారా లభించిందని మంజుల తెలిపింది. ఈ షార్ట్ ఫిలిం తనకే కాదు. చూసిన ప్రతీ ఒక్కరికీ కూడా మనసుకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందట. ఒకసారి మనసుకు కనెక్ట్ అయితే అది ఏమనుకుంటుందో మనం తెలుసుకునే అవకాశం ఉంటుందనీ అంటోంది మంజుల. మనసు మాట వింటే జీవితంలో అనుకున్నది సాధిస్తాం.. ప్రయాణం ముఖ్యం కాదు, గమ్యం ముఖ్యం అంటోంది మంజుల. ఓకే వీలైతే ఫాలో అయ్యి చూడండి.