క్లాసిక్ హిట్ 'మన్మధుడు'కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం 'మన్మధుడు 2' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, సినిమాని అనుకున్న టైం కన్నా ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా యోచన చేస్తున్నారట. ఇది అక్కినేని ఫ్యాన్స్‌కి స్వీట్ న్యూసే. అయితే ఇది సాధ్యమేనా.. అంటే చిత్రవర్గాల నుండి సాధ్యమే అనే రిపోర్ట్స్ అందుతున్నాయి.
సినిమా స్టార్ట్ అయినప్పటి నుండీ, కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూస్‌గా షూటింగ్ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటూ 'మన్మధుడు 2' టీమ్ సందడి చేస్తోంది. ఈ వయసులోనూ నాగార్జున సినిమా కోసం చేస్తున్న వర్కవుట్స్ ఆయన డెడికేషన్‌కి నిదర్శనంగా నిలుస్తున్నాయి. యూత్‌కి మరింత ఇన్స్ప్రేషన్ అవుతున్నాయి. ఇదే జోరు కొనసాగిస్తే అనుకున్నట్లుగానే సినిమాని ముందుగానే విడుదల చేసేయడం ఖాయమే అనిపిస్తోంది. వాస్తవానికి దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ అంతకన్నా ముందే అంటే జూలైలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. అంటే మన్మధుడు ఇంకాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుందన్న మాట. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత గెస్ట్ రోల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అనుష్క, కీర్తిసురేష్, భూమిక తదితర ముద్దుగుమ్మలు ఈ సినిమాలో నటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ఏదిఏమైతేనేం పెద్ద సినిమాల కోసం దసరా వరకూ వెయిట్ చేయకుండా, జూలై స్లాట్‌ని 'మన్మధుడు' బుక్ చేసుకుంటే అంతకన్నా కావాల్సిందేముంటుంది సినీ ప్రియులకు.